రోమ్: యూరప్ దేశం ఇటలీపై కరోనా విలయతాండవం చేస్తోంది. మహమ్మారి కరోనా వైరస్ ధాటికి ఆ దేశం చిగురటాకులా వణికిపోతోంది. ఈ ప్రాణాంతక వైరస్ ఇప్పటికే అక్కడ వేలాది మందిని బలితీసుకోగా... కేవలం శుక్రవారం ఒక్కరోజే దాదాపు 1000 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 9134కు చేరింది. అదే విధంగా దాదాపు 86 వేల మంది ఈ అంటువ్యాధి బారిన పడ్డారు. ఈ మహమ్మారి పురుడుపోసుకున్న చైనాలోని మరణాల కంటే ఇటలీలో సంభవించిన మరణాలు దాదాపు మూడు రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. కేవలం వారాల వ్యవధిలోనే వేలాది మంది కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే గత వారంతో పోలిస్తే శుక్రవారం నాటికి కరోనా మరణాల సంఖ్యలో తగ్గుదల నమోదైందని... సగటు మరణాల శాతం 8 నుంచి 7.4 శాతానికి పడిపోయిందని జాతీయ ఆరోగ్య సంస్థ పేర్కొంది. (కరోనా: ఊపిరితిత్తుల పరిస్థితి ఇది.. తస్మాత్ జాగ్రత్త!)
ఒక్కరోజులో 1000 మంది మృతి.. ఇటలీకి అండగా ఫ్రాన్స్